Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జూలై 23న నిర్వహించనున్న పండగ సాయన్న జయంతిలో అన్ని సామాజిక వర్గాల నాయకులు పాల్గొనాలని పాలమూరు పండగ సాయన్న సేవా సమాజం నాయకులు పిలుపు నిచ్చారు... మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణా కూడలిలో వున్న బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఏటా పండగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు... జయంతి సందర్భంగా పండగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం వుంటుందని తెలిపారు... ఎటువంటి భేషజాలకు తావివ్వకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనాలన్నారు... పండగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు... అలాగే 132 వ జయంతి సందర్భంగా మిని ట్యాంక్ బండ్ పై 132 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు..
Admin
Abhi9 News