Saturday, 13 June 2026 04:59:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మాదకద్రవ్యాల నిర్మూలనకు మహా పథం – 2500 విద్యార్థులతో మహబూబ్‌నగర్ పోలీసుల అవగాహన కార్యక్రమం"

Date : 24 June 2025 07:22 PM Views : 195

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మాదకద్రవ్యాల నిర్మూలన వారోత్సవాల సందర్భంగా, ఈరోజు మహబూబ్‌నగర్ బాయ్స్ కాలేజీ గ్రౌండ్‌లో జిల్లాలో ఎంతో భారీ స్థాయిలో జరిగిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐ.పి.ఎస్. గారు, దాదాపు 2500 మంది కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరంగా PPT ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కలిసి “మాదకద్రవ్యాలను దూరంగా ఉంచి, సమాజాన్ని రక్షిద్దాం” అనే నినాదంతో ప్రతిజ్ఞా చేశారు. ఎస్పీ గారు మాట్లాడుతూ, "మాదకద్రవ్యాల ప్రభావం నుండి యువతను రక్షించడం మనందరి బాధ్యత. ప్రతి కుటుంబం, విద్యాసంస్థ, సమాజం ఈ జాగ్రత్తలో భాగస్వాములై ఉండాలి. యువత ఈ దేశ భవిష్యత్తు. వారు మాదకద్రవ్యాల బారిన పడకుండా వారిని సరైన దిశలో మలచుకోవడంలో అందరం కృషి చేయాలి." అని అన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నివారణపై రూపొందించిన వివిధ పోస్టర్లను కూడా ఎస్పీ గారు ఆవిష్కరించారు. అయితే అవగాహన మాత్రమే కాదు, మాదకద్రవ్యాల సరఫరా చేసే వ్యక్తులపై జిల్లా పోలీసు శాఖ తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి న్యాయ ప్రక్రియకు లోబరిచినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాలేజీ ప్రిన్సిపల్, పోలీసు అధికారులు, టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యువతలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడమే కాకుండా, సమాజాన్ని మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచడంలో కీలకంగా మారుతుందని ఎస్పీ గారు తెలిపారు. జిల్లా అంతటా ఇలాంటి కార్యక్రమాలను ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమ కేలెండర్ రూపొందించామని, సమాజం నాణ్యత గల జీవనాన్ని కొనసాగించాలంటే మత్తుపదార్థాల నిర్మూలన అత్యవసరమని పేర్కొన్నారు. I AM ANTI DRUG SOLDIER” అనే పోస్టర్ పై ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి అందరూ I AM ANTI DRUG SOLDIER గా నమోదు చేసుకొని మాధకద్రవ్యాల నిర్ములనలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థుల సందేహాలను కూడా ఎస్పీ గారు ప్రత్యక్షంగా పరిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ గారు అందరికీ మత్తుపదార్థాల నిర్మూలనలో భాగస్వాములై మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి జరీనా బేగం, DSP రమణా రెడ్డి, DIEO/గర్ల్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కౌసర్ జహర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, బాయ్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవంత చారి, వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్, నర్సిములు, IT కోర్ టీం SI రవి మరియు ఇతర పోలీసు సిబ్బంది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :