Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని హన్వాడ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి నంబి వేణుగోపాల్ యాదవ్ BRS పార్టీ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గత 70 ఏళ్ల నుండి అభివృద్ధికి దూరంగా ఉన్న మహబూబ్ నగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం పట్ల, BRS పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై బిజెపి పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో పార్టీలో చేరినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరంతర విద్యుత్తు దళిత బంధు రైతు బంధు రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, గ్రామాల అభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఇద్దరు రాష్ట్రాలకు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో పార్టీలో పని చేస్తే పార్టీలో ఎంతో భవిష్యత్తు ఉంటుందన్నారు. నంబి వేణుగోపాల్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా నంబి వేణుగోపాల్ యాదవ్ కు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో హన్వాడ మండల మాజీ ఎంపీపీ వడ్ల శేఖర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యులు MD మన్నన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవేందర్ రెడ్డి, సాయిలు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News