Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుండీ ఉత్తర్వులు వెలువడటం 100 మెడికల్ సీట్లతో కాలేజ్ కి అనుమతి లకభించడం పట్ల గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, విద్యార్థులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి పాలభిషేఖం చేశారు. ఈ సందర్బంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ప్రస్తుత ప్రభుత్వ హాస్పిటల్ కి బిల్డింగ్ అప్ గ్రేడ్ చేస్తూ అవసరమైన వైద్య సామాగ్రి కొనుగోలుకు అనుమతులు రావడం హర్షనీయమన్నారు.మెడికల్ కాలేజ్ ,ప్రస్తుత ప్రభుత్వ హాస్పిటల్ భవనాలు రోడ్లు నిర్మానానికై TSMSIDC కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన గద్వాల జిల్లాకు అన్ని హంగులతో కూడిన వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ప్రకటన రావడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదములు తెలిపారు.
Admin
Abhi9 News