Saturday, 18 April 2026 05:12:26 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతాం... వార్డు పర్యటన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 13 June 2023 07:34 PM Views : 273

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ను సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక క్రీడలు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోయిల్ కొండ ఎక్స్ రోడ్డులో స్థానిక కౌన్సిలర్ కోట్ల నర్సింహులు యాదవ్ తో కలిసి వార్డు సమస్యలపై పర్యటన చేపట్టారు. స్థానికులు తెలిపిన సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకుపోయి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.100 శాతం సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడతామన్నారు. కోయిల్ కొండ చౌరస్తా తో పాటు స్థానిక ప్రాథమిక పాఠశాల వద్ద రూ. 3లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్న యాదవ్, వైస్ చైర్మన్ గణేష్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :