Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బోలిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒకటో పట్టణ సీఐ సైదులు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కాటన్ సెర్చ్ లో భాగంగా 150 గృహాలలోని 95 బైకులు 20 కార్ల డాక్యుమెంట్స్ ను తనిఖీ చేయగా సరైన డాక్యుమెంట్స్ లేని 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ సైదులు మాట్లాడుతూ కాలనీలో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కాలనీవాసులు అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కొత్తగా ఇల్లు అద్దెల కోసం ఎవరైనా వస్తే వారి పూర్తి సమాచారం సేకరించి ఇళ్లను అద్దెలకు ఇవ్వాలని ఏవైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు ఈ కార్డెన్ సర్చ్ లో ఇద్దరు ఎస్సైలు ఇద్దరు ఎ.ఎస్ఐలు ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్ 15 మంది కానిస్టేబుల్స్ ఇద్దరు హోంగార్డ్స్ పాల్గొన్నారు అని ఆయన తెలిపారు
Admin
Abhi9 News