Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : చిన్న చింతకుంట మండలం పెద్ద వడ్డేమాన్ ZPHS హై స్కూల్ లో వేసవి అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ.జి. మధుసూదన్ రెడ్డి (GMR) ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ..ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందని, అందులో భాగంగా ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోందని తెలిపారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య ఒకటే మార్గమన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని, ఇప్పటికే అన్ని స్కూళ్లకు యూనిఫాం లు, పాఠ్యపుస్తకాలను చేరవేసిందని అన్నారు.
Admin
Abhi9 News