Saturday, 18 April 2026 06:50:10 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కేసీఆర్ పార్కులో నాలుగు నెలల్లో టెంట్ సిటీ ప్రారంభం... లగ్జరీ టెంట్ హౌస్ లతో పాటు రెస్టారెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు

Date : 21 June 2023 05:18 PM Views : 356

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో రాబోయే 4 నెలల్లో ప్రసిద్ధ వారణాసి టెంట్ సిటీ తరహాలో ఇక్కడ కూడా అత్యద్భుతంగా టెంట్ సిటీని ప్రారంభిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వారణాసిలో ఉన్న ప్రఖ్యాత టెంట్ సిటీ నిర్వాహకులు లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి బుధవారం నాడు ఎకో పార్కులో టెంట్ సిటీ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. మొదటి దశలో 20 లగ్జరీ టెంట్ హౌస్ లతో పాటు రెస్టారెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. రెండో దశలో ఉడెన్ కాటేజెస్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలోనే అతి పెద్దదైన ఎకో పార్కులో పర్యాటకులను ఈ టెంట్ సిటీ ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా టెండర్లను ఆహ్వానిస్తున్నామని... ప్రఖ్యాత వారణాసి టెంట్ సిటీ నిర్వహిస్తున్న లల్లూజీ అండ్ సన్స్ గ్రూప్ సాధ్యమైనంత త్వరలోనే టెంట్ సిటీని అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్ అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మారనుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.పర్యాటకశాఖ ఓఎస్డి సత్యనారాయణ, లల్లూజీ అండ్ సన్స్ గ్రూపు బిజినెస్ హెడ్ సిద్ధార్థ మంత్రి వెంట ఎకో పార్కులో పర్యటించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :