Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సినీనటి, ప్రఖ్యాత నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి బుధవారం ఉదయం వచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కలెక్టర్ వల్లూరి క్రాంతితో సమావేశమై జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నారని ఆమె పీఏ, వెంట వచ్చిన అనుచరులు తెలిపారు. అలాగే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో వచ్చినట్లు తెలిపారు.
Admin
Abhi9 News