Saturday, 13 June 2026 04:57:40 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మరికెల్ మండల కేంద్రంలో ప్రవేట్ పాఠశాలల్లోఆర్థిక దోపిడీ

Date : 27 June 2023 03:07 PM Views : 303

Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : మరికల్ మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఎక్కువగా పేద మధ్యతరగతి వారు ఎక్కువగా ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు చాలామంది ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా డబ్బు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుని పాఠశాలను నడిపిస్తున్నారని, స్కూళ్లలో ఫీజుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అని వారు అన్నారు. మరికెల్లో ఇంటర్ కాలేజీ ఫీజు కంటే Lkg కే అధిక ఫీజు ఉంది అని వారు ప్రశ్నించారు. కొన్ని స్కూల్లో విద్యా ప్రమాణాలను తుంగలో తొక్కుతూ మేము ఎంత ఫీజు పెంచిన ఎవరు అడిగవాళ్ళు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని ప్రవేట్ స్కూల్లో బిల్డింగుకు పార్కింగ్ నిర్వహించే ప్రదేశాలలో చిన్నచిన్న తరగతులుగా విభజించి స్కూల్ నడిపిస్తున్నారు. తరగతి గదులకు సరైన వెలుతురు గాలి లేకుండా, ఒక పెద్ద వర్షం పడితే నీళ్లు వచ్చే అవకాశం కొన్ని స్కూల్స్ లో ఉంది ,అయినా మాకు ఇవేమీ పట్టనట్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అని వారు వాపోయారు.అలాంటి పాఠశాల లకు అనుమతులు ఇచ్చిన అధికారి ఎవరు అని ప్రశ్నించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అధికారి బాధ్యత తీసుకుంటారా? పిల్లల కు చదువుతోపాటు మానసిక అభివృద్ధి చెందాలంటే ఆడుకోవడానికి ఆట స్థలాలు ఉండాలి ,మరికెల్లో ఎన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఆట స్థలాలు ఉన్నాయి అని వారు ప్రశ్నించారు? ఇంగ్లీష్ మీడియంఅని అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా ఇంగ్లీషు కు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ లు ఎన్ని స్కూల్లో ఉన్నాయి ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? సైన్స్ కు సంబంధించిన ల్యాబ్ లుఎన్ని పాఠశాలలో ఉన్నాయి? కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కేవలం ఇంటర్ డిగ్రీ చదివిన వారితో బోధన చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి మరికెల్లోని ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ,అపోజిషన్ పార్టీ అనకుండా అందరి పిల్లలు చదువుకుంటున్నారు దీనిని ప్రశ్నించే బాధ్యతను అందరు మర్చిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన మరికల్ యువకమండలి అధ్యక్షులు మరియు కార్యవర్గం దీనిపైన విద్యాశాఖ కు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రవేట్ పాఠశాలలో ఆర్థిక దోపిడిని నుంచి పేద మధ్యతరగతి ప్రజలకు విముక్తి కల్పించాలని వారు కోరారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :