Saturday, 18 April 2026 06:47:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..

ఏదైనా కంపెనీలో పనిచేస్తే ఎవరికైనా జీతాలు ఇస్తారు..కానీ.. ఓ గజ దొంగ మాత్రం.. దొంగతనం చేయడానికి కూడా కొంతమందిని నియమించుకున్నాడు. వీళ్లకు టార్గెట్ ఇస్తూ

Date : 23 October 2025 08:42 PM Views : 222

Abhi9 News - తెలంగాణ / జగిత్యాల : జగిత్యాల జిల్లా పోలీసులు అంతరాష్ట్ర దొంగలను ముఠాను అరెస్టు చేశారు. పథకం ప్రకారం దొంగతనాలు చేస్తూ.. బంగారం, నగదు కొల్లగొట్టడం వీరి స్టైల్. అయితే.. ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృంధాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భాగంగా ముగ్గురు ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు.. అయితే.. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర హింగొలి జిల్లా బస్మత్ ప్రాంతానికి చెందిన మార్కులే అనిల్.. ఈ దొంగల ముఠాలో ప్రధాన నిందితుడు. ఇతడు.. పెద్ద గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఈ ముఠాలో మొత్తం.. పది మంది సభ్యులున్నారు. అనిల్.. పది మందిని నియమించుకొని.. వారికి జీతాలు ఇస్తున్నాడు. నెలకు ఇంత అని వారికి జీతాలు ఇస్తూ దొంగతనాలు చేయిస్తున్నాడు. మొత్తం సభ్యులను రెండు గ్యాంగులుగా విడగొట్టాడు. ఒక్కో గ్యాంగ్‌లో నలుగురు దొంగలతో పాటు, ఒక్కరు డ్రైవర్ ఉంటారు. వీరంతా.. నాలుగైదు రోజులకు ఒకసారి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని చోరికి పాల్పడతారు. దొంగతనం చేయడానికి ముందు.. వీళ్లంతా.. ముఖాలకు మాస్క్ పెట్టుకొని.. వివిధ ప్రాంతాలు తిరుగుతారు. తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారు. తరువాత.. ఈ దొంగల ముఠా.. తాళాలు పగులగొట్టి.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్లి అనిల్‌కి అప్పజెప్పుతారు.. తరువాత.. ఈ దొంగల ముఠాకు అతను కొన్ని డబ్బులు ఇస్తాడు. దీంతో.. వారంలో రెండు, మూడు దొంగతనాలు చేయడం వీరికి అలవాటుగా మారింది.. ఇటీవల కేసుల సంఖ్య పెరిగిపోవడంతో.. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపును ముమ్మరం చేశారు. అందులో భాగంగా.. జగిత్యాల బైపాస్ రోడ్డులో ముగ్గురిని పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ బాలుడుతో పాటు.. సాయినాథ్, శ్రీకాంత్ అనే దొంగలు ఉన్నారు. ఇంద్రవెళ్లికి చెందిన శ్రీకాంత్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ప్రధాన నిందితుడు అనిల్ పరారీలో ఉన్నారు. ఈ దొంగ కోసం.. మరో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి.. ముమ్మరంగా గాలిస్తున్నారు.. అయితే.. జీతాలు ఇచ్చి.. దొంగతనాలు చేయించడం అతని స్టైల్ అని పోలీసులు చెబుతున్నారు. వారికి.. నెల.. నెల డబ్బులు ఇవ్వడంతో.. దొంగతనం చేయడం అలవాటుగా మారిందట.. నిరుద్యోగంతో బాధపడుతున్న వారిని గుర్తించి.. ఈ దొంగల ముఠాలో చేర్పించుకుంటున్నాడు అనిల్. ప్రధాన నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :