Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కిషన్ రెడ్డి వస్తానంటే నేనే తీసుకెళ్లి చూపిస్తా: తలసాని

డబుల్ బెడ్రూం ఇళ్లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మంత్రి బీజేపీ నేతలది పొలిటికల్ డ్రామా అంటూ విమర్శలు రూ.8.65 లక్షలతో ఇల్లు కడితే కేంద్రం ఇచ్చేది రూ

Date : 20 July 2023 01:41 PM Views : 299

Abhi9 News - తెలంగాణ / Hyderabad : బీజేపీ నేతలు చేపట్టిన చలో బాటసింగారం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సహా పలువురు నేతలను నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. కాగా, ఈ విషయంపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తానంటే తానే స్వయంగా తీసుకెళ్లి డబుల్ బెడ్రూం ఇళ్లను చూపిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా తక్కువేనని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8.65 లక్షలు వెచ్చించి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తుంటే కేంద్రం కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన రూ.600 కోట్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనేలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు ఇలా ఉంటే ఇక్కడ బీజేపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తలసాని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించడం అవసరమా? అని ప్రశ్నించారు. గతంలో ఇదే కేంద్ర మంత్రితో కలిసి తాను డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం చేశానని తలసాని చెప్పారు. ఆ కార్యక్రమంలో డబుల్ బెడ్రూం ఇళ్లు బాగా నిర్మించారని కిషన్ రెడ్డి మెచ్చుకున్నారని గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కిషన్ రెడ్డి తన షెడ్యూల్ మార్చుకుని సడెన్ గా బాటసింగారం ప్రోగ్రాం పెట్టుకున్నారని ఆరోపించారు. ఓవైపు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలతో జనం ఇబ్బంది పడుతుంటే బీజేపీ నేతలు మరింత ఇబ్బంది పెడుతున్నారని తలసాని మండిపడ్డారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :