Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం కేతిపల్లి లో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి తెలుగు మీడియం చదువుతున్న ఆరుగురు బాలికలకు కేతిపల్లి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ పవన్ సూచన మేరకు బ్యాంక్ క్యాష్ ఆఫీసర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో సంతోషనిస్తుందని అలాగే పేద విద్యార్థులకు ఎవరు తోచిన శక్తి కొద్ది సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బందిని స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు...
Admin
Abhi9 News