Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీని రక్షించేందుకే నేడు ఇందిరమ్మ ఇళ్ళ అవినీతిని పక్కనపెట్టి కేసీఅర్ డబుల్ బెడ్ రూమ్ ను మొదలుపెట్టారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి కేసీఅర్ పై తీవ్ర విమర్శలు చేశారు...మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనీ ధర్నా చౌక్ లో అర్హులైన నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని తలపెట్టిన ధర్నాలో ముఖ్యఅతిథిగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుపేదలు కేసీఆర్ ను నమ్మి డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకుంటే కెసిఆర్ ఇచ్చింది మాత్రం కేవలం 23 వేల డబుల్ బెడ్ రూంలు మాత్రమే అని అన్నారు.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మరోసారి నమ్మి 2019లో ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు... బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్ రూమ్లలో నాణ్యత లేదని అన్నారు... పక్షపాత ధోరణితో పార్టీ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారని అది కూడా డబ్బు తీసుకొని ఇచ్చారని మండిపడ్డారు... కెసిఆర్ కు సిగ్గు లేకుండా ఏ విధంగా దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసు అని అన్నారు... కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, నాయకులు పడాకుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు...
Admin
Abhi9 News