Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా దారుణమని దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కమ్మదనం గ్రామంలో బిజెపి బూత్ కార్యకర్తల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఎంపీ డీకే అరుణ వెంట రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పతంగి రాజగోపాల్ గౌడ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం చాలా అసమంజసనీయమని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతం నుండి ఫిర్యాదులు చేస్తూనే వచ్చామని గుర్తు చేశారు. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు కూడా రికార్డు చేశారని ఇది కూడా చాలా దుర్మార్గమని డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఒకరి పూర్తి స్వేచ్ఛను హరించడమే ఈ ట్యాపింగ్ వ్యవహారం అని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ కారణాలు చెప్పి మామూలు కార్యకర్త ఫోన్ నంబర్లను కూడా ట్యాపింగ్ చేయడం దారుణమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతాల్లో ట్యాపింగ్ జరిగాయో దీని వెనుక ఎవరున్నారు వారు బయటకు రావాలంటే దీనిపై సిబిఐ విచారణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే కేసును సిబిఐకి అప్పజెప్పాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి దేపల్లి అశోక్ గౌడ్ మోహన్సింగ్, విజయభాస్కర్ ఇస్నాతి శ్రీనివాస్ చేగు సుధాకర్ చెట్ల వెంకటేష్ వంశీకృష్ణ పేట అశోక్ రంగన్న గౌడ్ లష్కర్ నాయక్ అనిల్ గౌడ్ శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
Admin
Abhi9 News