Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలని మరియు పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె నవాబు పేట మండలం కేంద్రంలో చేపట్టిన సమ్మెకు టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని సంఘీభావం మద్దతు ప్రకటించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా గ్రామాలో పరిశుభ్రతకు ముఖ్య భూమిక పోషించి పని చేస్తున్న వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ సిబ్బంది పక్షాన నిలబడి పోరాడుతుందని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పేర్కొన్నారు, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు,
Admin
Abhi9 News