Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన గట్టిప్పలపల్లి గ్రామస్థులు, తలకొండపల్లి మండలం లోని గట్టిప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్, దాదాపు రెండున్నర గంటల పాటు నిరసన అరెస్ట్ చేసి వదిలేసిన పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు ట్రాక్టర్ల పై ర్యాలీగా వచ్చి తమ గ్రామాన్ని మండలం గా ప్రకంటించాలని నిరసన చేపట్టారు, దాదాపు మూడు గంటల పాటు ఎమ్మెల్యే వస్తాడని వేచి చూసారు రాకపోవడంతో, ఫోన్ లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడం తో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది, గ్రామస్థులు మాట్లాడుతూ :- కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు చేసినప్పుడు తమ గ్రామాన్ని మండలం గా ఏర్పాటు చేయాలని కోరగా పట్టించుకోలేదని, తమకు మండలం బ్యాంకు చాలా దూరంగా ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ మధ్య 39 రోజులు గ్రామస్థులు దీక్షలు చేపడితే ఎమ్మెల్యే ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొత్త మండలాల్లో మీ మండలం ఉంటుంది అని హామీ ఇచ్చి ఎమ్మెల్యే దీక్షలు విరమింపచేసి నియోజక వర్గం లో ఇర్విన్ ను మండలం గా ప్రకటించి ఎమ్మెల్యే మాటతప్పారని మండిపడ్డారు.
Admin
Abhi9 News