Thursday, 08 January 2026 02:41:59 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

మీ తలరాత మారుస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

3.10 కోట్ల రూపాయల తో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి భూమి పూజ ... 2 కోట్ల రూపాయల తో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణాని

Date : 09 July 2025 02:46 PM Views : 131

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మీ తలరాత మార్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి 2 కోట్ల రూపాయలతో మరియు 3.10 కోట్ల రూపాయల తో నిర్మించనున్న ఒకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ రెండు సంవత్సరాలు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని, టైపాస్ చేస్తే జీవితం కూడా టైంపాస్ అవుతుంది అని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన ప్రతి వారం విద్య పైన సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి ఆశీస్సుల తోనే బాసర ఐఐఐటి కళాశాలను మన మహబూబ్ నగర్ కు రావడం జరిగిందని చెప్పారు. మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయని, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గతంలో మన తెలంగాణ రాష్ట్రం విద్యలో దేశంలో 36 వ స్థానంలో ఉండేదని, కేవలం ఒక్క సంవత్సరంలోనే 26 వ స్థానానికి తెలంగాణ రాష్ట్రం రావడం చాలా సంతోషంగా ఉందని, రానున్న రెండు మూడు సంవత్సరాల్లో 5 స్థానాల లోపు తెలంగాణ రాష్ట్రం ఉండాలని , మనందరి కృషితోనే అది సాధ్యం అవుతుంది అని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఒకేషనల్ జూనియర్ కళాశాల మొదటి స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటినుండి ఒక లెక్క అని ఆయన చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఎప్సెట్ లో 114 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ లో సీట్లు సాధించారని, ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగాలని, ప్రొఫెషనల్ కోర్సులలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఇక్కడ ఇచ్చే ఎప్సెట్ శిక్షణ లో చేరి ఉచితంగా శిక్షణ పొందవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అందిస్తున్నామన్నారు. అంతకుముందు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి ప్రగతి నివేదిక ఇస్తూ, ఎమ్మేల్యే గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎప్సెట్ శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని అద్భుతమైన ఫలితాలు సాధించామని , దాని ఫలితంగా ఈ సంవత్సరం 700 మంది విద్యార్థులు నూతనంగా కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారని చెప్పారు. ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అంపశయ్య మీద ఉన్న ఒకేషనల్ జూనియర్ కళాశాలకు ఊపిరి పోశారు అని , ఒకేషనల్ జూనియర్ కళాశాల నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేసి 3.10 కోట్ల రూపాయలను తీసుకువచ్చి అసంపూర్తిగా ఉన్న కళాశాల భవన నిర్మాణానికి ఈరోజు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరుఫున ప్రిన్సిపాల్, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టి పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, రాజేందర్ రెడ్డి, గట్టు వెంకట్ రెడ్డి, సతీష్ రెడ్డి, భీం రెడ్డి, డా.జహంగీర్ అలీ, ఇంటర్మీడియట్ విద్యాధికారి కౌసర్ జహాన్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు, నర్సింహారెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :