Thursday, 08 January 2026 03:10:09 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

మత్తు పదార్థాల నివారణతోపాటు , యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని కృషి చేయాలి

Date : 27 June 2023 03:03 PM Views : 294

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మత్తు పదార్థాల నివారణతోపాటు , యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ, అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలోని సమావేశం మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమా సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న జీవన పరిస్థితులు ,ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సైతం మత్తుపదార్థాలకు బానిసలు అవుతున్నారని,అలాగే విద్యార్థులతో పాటు,సాధారణ సమాజం సైతం మత్తు పదార్థాల బారిన పడటం బాధాకరమని అన్నారు. యువత ప్రత్యకించి విద్యార్థులు మతపదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించడంతోపాటు, ఎవరైనా పొరపాటున మత్తు పదార్థాలకు బానిసలు అయినట్లయితే వారికి చికిత్స అందిస్తూనే పునరావస కేంద్రాల ద్వారా వారిని బాగు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం తరఫున అలాగే స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలపట్ల ముఖ్యంగా మత్తుపదార్థాల విషయం పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కల్లు, సారా అదేవిధంగా గుట్కా ఇతర మత్తుకు సంబంధించిన మందులు అన్నింటివల్ల కలిగే క్షణిక సంతోషం గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలను సైతం దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరూ మత్తు పదార్థాల బారిన పడకుండా అందరూ పనిచేసి 100% నివారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అంతకుముందు ఉదయం జిల్లా పరిషత్తు మైదానం నుండి తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీ ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడితే చాలా ఇబ్బందులు ఉంటాయని, అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు బారిన పడకుండా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాజం ఆరోగ్యం గా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు .ర్యాలీకి హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య మత్తు పదార్థాల సమస్యని అన్నారు .యువత మత్తు మందుల బారిన పడకుండా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంతో మంది యువతీ,యువకులు మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు, కుటుంబాలను సైతం నాశనం చేస్తున్నారని, యువత ఇలా పక్కదారిని పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాళ్లందర్నీ మంచి మార్గంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని, వ్యసనాలకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యతను అందరు స్వీకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ కే .నరసింహ మాట్లాడుతూ జిల్లాలో మత్తుపదార్థాల నివారణకు అదేవిధంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో మత్తుమందుల నివారణలో భాగంగా 14 మందిని గుర్తించడం జరిగిందని ,దీనిని పూర్తిగా నిరోధించడంలో అందరి సహాయ సహకారాలు అవసరమని ,అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తుపదార్థాల నివారణకు ఉద్దేశించిన జిల్లా స్థాయి కమిటీలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కమిటీ మత్తుపదార్థాల నివారణ, నిషేధానికై కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి, జెడ్పి సీఈవో జ్యోతి, డి ఈ ఓ రవీందర్, ఎక్సైజ్ సూపరింటెంట్ సైదులు, సిడబ్ల్యుసి చైర్మన్ నాయీమ్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రహమాన్ తదితరులు మాట్లాడారు.ఈ సందర్భంగా మత్తు పదార్థాల నివారణకై ఉద్దేశించిన వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ,ఎస్పీలు విడుదల చేయగా, అంతేకాక మత్తు. పదార్థాలను వినియోగించడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించే నిమిత్తం ఏర్పాటు చేసిన సిగ్నేచర్ ను ప్రారంభించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :