Saturday, 18 April 2026 06:50:51 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం 2003 పై ఈరోజు జిల్లాస్థాయి అధికారుల సమన్వయ సమావేశము

Date : 13 July 2023 05:10 PM Views : 203

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం 2003 పై ఈరోజు జిల్లాస్థాయి అధికారుల సమన్వయ సమావేశము కలెక్టరేట్ IDOC హాలులో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె. సీతారామరావు అదనపు కలెక్టర్ విచ్చేసి ఈ చట్టంపై వివిధ శాఖలు నిర్వహించవలసిన పాత్రల గురించి వివరించారు. గతంలో బస్సులలో ప్రయాణించాలంటే పొగ త్రాగే వారి వల్ల ఇబ్బంది కలిగేదని, పొగ త్రాగరాదు, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు తగ్గిందని తెలిపారు. పొగ తాగ టాన్ని యువకులు ఒక ఫ్యాషన్ గా భావించి అలవాటు పడతారని, సినిమాలు చూసి హీరో మాధిరి పొగ తాగాలని చూస్తారని,స్కూల్, కళాశాల విద్యార్థులు మొదటగా అలవాటు పడతారు. ఈ మధ్య సిగరెట్లలో డ్రగ్స్ పెట్టుకొని పొగ పీలుస్తున్నారు,ఇది ఒక రకంగా డబ్బులు ఇచ్చి జబ్బు తెచ్చుకోవడం వంటిది అని హెచ్చరించారు. రైతులకు పొగాకు పంటలకు బదులుగా ఇతర పంటలు పండించేటట్లు ప్రోత్సహించాలని తెలిపారు. సీసీ కుంట మండల పరిధిలో తయారవుతున్న బీడి కట్టలపై తప్పకుండ పుర్రె బొమ్మలు ఉండేటట్టు చూడాలని సూచించారు.ప్రతి పాఠశాలలో, కళాశాలలో పొగతాగడం వల్ల కలిగే అనర్థాల గురించి ఒక ఫ్లెక్సీ బోర్డు ఉంచాలని తెలిపారు.ఇది ఒక ఆరోగ్యశాఖనే కాకుండా అన్ని శాఖల సమన్వయంతో మాత్రమే పొగ తాగడం మరియు ఇతర రకాలుగా పొగాకు వాడకాన్ని నిలువరించగలమని తెలిపారు.మన జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ వారు దాదాపుగా ఆరు లక్షల 80 వేల దాకా ఫైన్లు వేసి చలానా కట్టించడం మంచి పని అని అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ DMHO , డాక్టర్ భాస్కర్ నాయక్ Dy DMHO ,డాక్టర్ సంధ్యాకిరణ్మై, ఎయిమ్స్ నుండి డాక్టర్ కిషోర్ రాష్ట్ర COTPA అధికారి డాక్టర్ శ్రావణ్ , శ్రీనివాసులు డిఎస్పీ రహమాన్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :