Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జాత శుక్రవారం రోజు మహబూబ్నగర్ టౌన్ హాల్ కు చేరుకున్న సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఘనస్వాగతం పలికి అక్కడ జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడి ఉద్యోగుల కనీస వేతనం 26000 అమలు పరచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులకు 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం కనీస వేతనము, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నూతన విద్యావిధన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీఏడీఏలు కూరగాయల బిల్లులు ఇంటి అద్దెలు తదితర వాటినే తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .కేంద్ర ప్రభుత్వం బిజెపి ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్య పరచాలని, ప్రైవేటీకరించాలని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని చేస్తున్న ప్రయత్నాలను సంఘం అడ్డుకొని ముందుకు వెళుతుందని ,బిజెపికి బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు. శుక్రవారం రోజు జాతాను జయప్రదం కాకుండా సిడిపిఓలు సూపర్వైజర్లు యూనియన్ మీటింగ్లకు వెళ్లరాదని చెప్పడం అంటే అధికారులు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, యూనియన్ పెట్టుకునే హక్కును భరించడం లేదని ,ఇవి ఆప్రజాస్వామిక విధానాలని విమర్శించారు .ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు కిళ్ళే గోపాల్ ,జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ అంగన్వాడి సమస్యలు పరిష్కరించకపోతే జులై 10న పెద్ద ఎత్తున నల్ల చీరలతో కలెక్టరేట్లను ముట్టడిస్తామని, అంగన్వాడి వర్కర్లు పోరాట స్ఫూర్తితో హక్కులు సాధించుకోవాలని సిడిపిఓ లా సూపర్వైజర్ల వేధింపులను ఆపాలని వారు డిమాండ్ చేశారు .లేనిచో సిఐటియూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.రాష్ట్ర నాయకురాలు మంజుల మాట్లాడుతూ అంగన్వాడీల ఐక్యమత్యంతో పోరాడాలని అధికారుల వేధింపులను వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుష్ప, సరోజ కవిత ,గౌస్య బేగం ,గంగాభవాని మహిమద తదితరులు మాట్లాడుతూ హక్కుల కోసం ఎంతైనా తెగించి పోరాడుతామని బెదిరింపులకు బెదిరేది లేదని ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు జీతాలు పెంచాలని వేధింపులు ఆపాలని పని భారం తగ్గించాలని ఆన్లైన్ పనులు ఆపాలని ఇట్లాంటి విధానాలు మానుకోపోతే ఉద్ధృత పోరాటాలు చేపడతామని వారు హెచ్చరించారు. అంగన్వాడి జాతకు సంఘీభావంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వరద గలెన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ ,భవన నిర్మాణ కార్మిక సంఘం టౌన్అధ్యక్ష కార్యదర్శులు ఎర్ర వెంకటయ్య వరద లక్ష్మయ్య సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు వి కురుమూర్తి, సిఐటియు పట్టణ నాయకులు రాజ్ కుమార్ తదితరులు మాట్లాడారు ఇందులో కమల, లీలావతి, పద్మ ,సంగీత తదితరులు పాల్గొన్నారు
Admin
Abhi9 News