Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న ఐపిసి కేసులు (436) డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు (883). ఈపెట్టి కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన మరియు తదితర ఈపెట్టి కేసులు (1858).మొత్తం కేసులు (3177) ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున ఈ కేసులు పరిష్కరించబడినాయి అని తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులను సిబ్బందిని ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, ప్రతిరోజు మానిటర్ చేసిన ఇన్స్పెక్టర్ లకు , త్వరలో రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు. జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Abhi9 News