Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ధర్మన్న కుంట చెరువు బీఆర్ఎస్ కుంటగా మారిందని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గ ఇంచార్జీ బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు.గతంలో మరికల్ మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌరస్తాలో కబ్జాకు గురైన ధర్మన్న కుంటను కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చెరువులపై మత్స్యకారులకు ఉన్న హక్కులను కాలరాస్తూ, బీఆర్ఎస్ నాయకులు చెరువులను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.రెవెన్యూ అధికారుల అండతో చెరువును రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారని,ఎమ్మెల్యే అండ లేకుంటే చెరువులను కబ్జా చేయగలరా? అంటూ ప్రశ్నించారు. చెరువులకు నాలా అనుమతులు ఎట్లిస్తరో అధికారులు సమాధానం చెప్పాలన్నారు.ఒక పక్క మత్స్యకారుల పొట్ట కొడుతూ బీఆర్ఎస్ నాయకులు చెరువులను ఆక్రమిస్తున్నరని,మరో పక్క జిల్లా మత్స్య శాఖ అధికారులు మత్స్యకారులకు కబ్జాలకు గురైన చెరువులను,కుంటలను లీజుకు ఎట్లా ఇస్తారని మండిపడ్డారు
Admin
Abhi9 News