Saturday, 18 April 2026 06:47:28 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల పేరు తో మోసం చేస్తున్న కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

Date : 23 June 2023 04:14 PM Views : 494

Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ భారీ ప్రదర్శన తో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 10 తలలు దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆర్డీవో కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రోగ్రాం ఇంచార్జ్ డా.మొగుళ్ళ అశోక్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర మహిళా కార్యదర్శి కాటమోని తిరుపతమ్మ కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్ల అయినా రాష్ట్రప్రభుత్వం మాత్రం ఈ నెల 2వ తేదీ నుండి 22 వ తేదీ వరకు ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తూ తన పార్టీ ప్రచారానికి దశాబ్ది ఉత్సవాలను జరుపుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ సమాజం జరిపిన పోరాటాలతోపాటు స్వరాష్ట్ర సాధన కోసం 1200 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ సాధిస్తే గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లు దాటినా ఆశయ సాధన దిశగా చేసిందేమీ లేదు. మిగులు బడ్జెట్తో లభించిన రాష్ట్రం నేడు ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల పాలయిందంటే ఈ అప్పుల పాపానికి పూర్తి బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే. గత ప్రభుత్వాలకు ముందుచూపు ఉన్నందునే అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తెలంగాణలో ఇవ్వాళున్న ప్రతి ప్రాజెక్టు గత ప్రభుత్వాలు చేపట్టినవే. 90 శాతం పనులు పూర్తి చేసినవే. ఈ తొమ్మిదేళ్లలో ఉన్న ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు పిల్ల కాలువలు తవ్వించి నీరందించలేని ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలను విమర్శించే హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుమీద రూపకల్పన చేసిన ప్రాజెక్టును నీ ధనదాహానికి పరాకాష్ఠగా కాళేశ్వరం పేరు మీద లోపభూయిష్టంగా రీ-డిజైన్ చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు అని అన్నారు...ఈ కార్యక్రమంలో నేషనల్ ఓబిసి కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రంగినేనీ జగదీశ్వర్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాము యాదవ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటమోని కృష్ణయ్య గౌడ్ , తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ గటౌన్ అధ్యక్షులు కాంతారావు ,అన్ని మండలాల అధ్యక్షులు పరశురాం , తగిలి కృష్ణయ్య శాంతయ్య నరసింహ , బీరయ్య మధుసూదన్ రెడ్డి శేఖర్ యాదవ్ అన్ని మండలాల యూత్ కాంగ్రెస్ నాయకులు, మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :