Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రం మహిళలకు వరంగా మారిందని మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహర్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రంలో రెండవ బ్యాచ్ పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో మేధోమథనం చేసి మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రమే మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రం అని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో ఈ శిక్షణా కేంద్రంలో కంప్యూటర్, బ్యూటీషన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ లలో శిక్షణ ఉచితంగా ఇస్తున్నామని , ఇప్పటి వరకు మొదటి బ్యాచ్ లో 217 మంది శిక్షణ పూర్తి చేసుకోగా, రెండవ బ్యాచ్ లో 247 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా సెంటర్ లో శిక్షణ పొందిన మహిళలు 30-40% వరకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయని, మిగతావారు కూడా తమ ఇంటి దగ్గరనే స్వయం ఉపాధి పొందుతున్నారని , ఇక్కడ శిక్షణ తీసుకొని, ఏదైనా యూనిట్ ప్రారంభించాలనుకునే వారి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ఎమ్మెల్యే గారు బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తూ సహకారం అందిస్తున్నారని, ఇప్పటికే మొదటి బ్యాచ్ పూర్తిచేసుకున్న కొందరు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వతహాగా యూనిట్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 17 వ తేదిన మొదటి బ్యాచ్ పూర్తి చేసుకున్న వారికి గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి చేతులమీదుగా సర్టిఫికెట్లను అందజేస్తామని, అదే రోజు రెండవ బ్యాచ్ వారికి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నట్లు తెలిపారు. మూడవ బ్యాచ్ కు అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఆసక్తి గల వారు అప్లై చేసుకోవాలని, వచ్చే బుధవారం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా మహిళలు ఈ కోర్సులో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు అని, అందుకు సంబంధించిన ఫీజును ఎమ్మెల్యే గారు చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రం ఇంచార్జీ నిజలింగప్ప, ఎమ్మెల్యే పి.ఎ. అనిల్, సెట్విన్ సంస్థ ఇంచార్జీ విజయ్ కుమార్, మహబూబ్ నగర్ ఫస్ట్ ఫ్యాకల్టీ గౌతమి, భవాని, కవిత, అనూష తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News