Abhi9 News - తెలంగాణ / వనపర్తి : రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను ప్రతినెల 1వ తేదీన చెల్లించాలని, జిల్లా టాప్రా (taprpa) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారికి గురువారం వినతిపత్రం సమర్పించారు. అన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో నగదు రహిత వైద్యం ఇప్పించాలని, కొత్త పిఆర్సి నియమించి, ఐఆర్ ప్రకటించాలని తదితర డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు. టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నారాయణ ,వేమన్న పలువురు నాయకులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News