Saturday, 18 April 2026 06:51:59 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఉమ్మడి జిల్లా డీసీసీలకు అధ్యక్షులుగా బీసీలనే నియమించాలి

Date : 21 October 2025 04:07 PM Views : 226

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి&ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ డిమాండ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బీసీలను నియమించాలని, అప్పుడే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న దానికి ప్రతిఫలం దక్కినట్లు అవుతుందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి&ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వనపర్తి , నాగర్ కర్నూల్ జిల్లా మినహా మూడు జిల్లాలకు డిసిసి అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు కనుక మరోసారి అభిప్రాయ సేకరణ అని, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, ఎవరైతే పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారో వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తామని పరిశీలకులు చెప్తూ ముందుకు వెళ్లడాన్ని గమనిస్తే మరోసారి బీసీలను అన్యాయానికి గురిచేసే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుల్లో మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉంటూ అధ్యక్ష బాధ్యతలలో కొనసాగుతూ ఉన్నారు వీరి స్థానాలలో చాలా ఏళ్లుగా పార్టీ కొరకు కష్టపడ్డ బీసీ నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి అవకాశం కల్పించి మిగతా మూడు జిల్లాలకు కూడా బీసీలను నియమించి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగాలలో కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కనీసం డిసిసి అధ్యక్ష బాధ్యతలు బీసీలకు కేటాయించి బీసీల నుంచి ఆగ్రహానికి గురి కాకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిన బీసీల అభిమానాన్ని చేరగోనే విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందని శ్రీనివాస్ సాగర్ అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 70 శాతం పైగా ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకొని ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా బీసీలనే నియమించాలి అని ఆయన కోరారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :