Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పంచాయతీ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇంటి ముందు వందలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ గత 13 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు జీతాలు పెంచాలని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, కర్ణాటక కేరళ ,తమిళనాడు మాదిరిగా పెర్మనెంట్ చేయాలని కనీస వేతనాలు అమలు పరచాలని, ప్రజా సేవకులు ఏం పనులు చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీ చైర్మన్ లకు లక్షలాది జీతాలు పెంచారని ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్రమ ద్వారా ఒళ్ళు వంచి పని చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రావడంలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. జీవో 60 ప్రకారం తక్షణమే శానిటేషన్ సిబ్బందికి 15 వేల ఆరు వందలు కారోబార్ బిల్ కలెక్టర్లకు 19500 తక్షణం అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. అదే రకంగా 2023 కేటగిరీగా కార్మికుల నియమించుకోవాలని ఎవరి జీతం వారికే ఇవ్వాలని ఒకరి జీవితం మరొకరికి పంచే విధానానికి స్వస్తి పలకాలని గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు జేఏసీ జిల్లా కార్యదర్శి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సాంబశివుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తుందని గ్రామపంచాయతీ కార్మికుల శ్రమ వల్ల పంచాయతీలకు అవార్డులు వస్తే అధికారులు సర్పంచులు తీసుకొని కార్మికులకు శాలువా కప్పి సన్మానం చేస్తున్నారని, సన్మానం కాదు పొట్ట నింపే కార్యక్రమం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే గ్రామపంచాయతీ సమ్మె డిమాండ్లను పరిష్కరించి వారి వేతనాలు పెంచాలని పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్టీటి సౌకర్యం కల్పించాలని ,పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఇందులో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ,ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కురుమన్న మాట్లాడారు ఇందులో నారాయణ ,మైబు వెంకటేశు ,రవి సాగరు ,మధు హనుమంతు ,నరసింహులు, అరుణ ,నాగన్న తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం ఎమ్మెల్యే సోదరుడు శశివర్ధన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఆయన ఎమ్మెల్యే గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ పంపిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పోలీసులు పెద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు శాంతియుతంగా ధర్నా ప్రదర్శన నిర్వహించి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముందు జీతాలు పెంచాలని ,పర్మినెంట్ చేయాలని నినదించారు
Admin
Abhi9 News