Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి మన దేశ గొప్పతనాన్ని చాటేలా చేస్తున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాల వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశం మహబూబ్ నగర్ పట్టణం లోని బాదం రామస్వామి సరోజాదేవి ఆడిటోరియం లో జరిగింది . ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయ సాంస్కృతి చాలా విలువలతో కూడుకున్నదని భావితరాలకు వారసత్వ సంపదగా మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. శాస్త్రీయ, సాంస్కృతిక విలువల ద్వారా గురువుకి, దేవుడికి, భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకునే గొప్ప అవకాశం పరోక్షంగానే కలుగుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా చిన్నారులను సంప్రదాయ నృత్యాల వైపు అడుగులు వేసేలా కృషి చేస్తున్న దీప్తి నృత్య కళాశాల నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, లయన్ నటరాజ్, మద్ది యాదిరెడ్డి నాయిని బాగన్న గౌడ్, నిర్వాహకులు వెంకటేష్, డాక్టర్ దీప్తి తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News