Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయి...ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే అవి సమసిపోతాయని రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసులలోని కక్షీదారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసారు. ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14.06.2025 వ తారీఖు వరకు నారాయణపేట, కోస్గి కోర్టులలో "నేషనల్ లోక్ అదాలత్" సందర్భంగా కక్షీదారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మీకు తెలిసిన వాళ్లపై ఏమైనా కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులను పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుందని అన్నారు. యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులలో ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చని ఎస్పీ అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కేసులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు. దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సంబంధిత కోర్ట్/ప్రదేశంలో హాజరుకావాలని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా బాధితులకు మంచి అవకాశం అని దిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.
Admin
Abhi9 News