Thursday, 08 January 2026 03:10:07 AM
# పాలమూరు : తెలంగాణలో టాప్-5.. మనోళ్లే..! # అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే..

రైతులు సంతోషంగా ఉంటే కళ్ళు మండి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు - హన్వాడ మండలం దాచకపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 18 July 2023 04:15 PM Views : 146

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : వ్యవసాయానికి రైతులకు 24గంటల కరెంటు అవసరం లేదా... కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు మూడు గంటల కరెంటు సరిపోతుందా... అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నదాతలను ప్రశ్నించగా... మూడు గంటల కరెంటు కనీసం తూకాలకు కూడా సరిపోదని, తమకు 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంటు కావాలని, కరెంటు వద్దన్న కాంగ్రెస్ నాయకులను పొలిమేర వద్దనే తరిమికొడతామని హెచ్చరించారు. హన్వాడ మండలం దాచకపల్లి గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం... గ్రామ కూడలిలో ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తామంతా ఊర్లు బాగు చేసుకుంటూ తిరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. 2014కు ముందు కనీసం కరెంటు ఇవ్వని నాయకులు ఇప్పుడు రైతు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. రైతులు సంతోషంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు కళ్ళు మండి కుట్రలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతు బీమా వంటి ఎన్నో పథకాలతో అన్నదాత ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడని తెలిపారు. కరెంటు అంశంలో కారుకూతురు కూర్చున్న కాంగ్రెస్ నాయకులను క్షమాపణ చెప్పిన తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలన్నారు. ఇప్పుడు రెండు పంటలు పండించుకున్న అన్నదాతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత సంతోషంగా మూడు పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఎండాకాలం కూడా చెరువులు, వాగులు, వంకల్లో జలకళ ఉండేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పిటిసి విజయనిర్మల రమణారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, వైస్ ఎంపీపీ లక్ష్మీ మోహన్ నాయక్, సర్పంచ్ బాలకిష్టారెడ్డి, ఎంపీటీసీ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :