Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : జిల్లా ఆయుష్ శాఖ ప్రోగ్రాం అధికారి డా .సురేష్ చౌహాన్ ఆధ్వర్యంలో సోమవారం "యోగా వాక్" నిర్వహించారు .జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన యోగా వాక్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.కృష్ణ,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.పి.వెంకటేష్ లు జెండా ఊపి స్పోర్ట్స్ స్టేడియం నుండి ప్రారంభించారు. స్పోర్ట్స్ స్టేడియం నుండి తెలంగాణా చౌరస్తా స్పోర్ట్స్ స్టేడియం వరకు నిర్వహించిన యోగా వాక్ లో ఆయుష్ శాఖ,రిటైర్డ్ ఉద్యోగులు,,ఇంటర్మీడియట్ విద్య ఉద్యోగులు,విద్యార్థులు యువజన సంఘాల సభ్యులు,సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యోగా వాక్ లో ఎల్.డి.ఎం. కల్వ భాస్కర్,జిల్లా యువజన,క్రీడల అధికారి శ్రీనివాస్,డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ శ్రీధర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఐ.ఎం. ఏ అధ్యక్షులు డా.రాం మోహన్, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ లు డా.ఎం.చంద్ర శేఖర్, డా.శ్రీమతి రూత్ ,, డా పహీం, డా.ఆది శేషయ్య,పతంజలి యోగ సమితి అధ్యక్షులు కె.వెంకట రాముడు,ఎల్.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
Admin
Abhi9 News