Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత తొమ్మిదేళ్లుగా ఒకనాడు అన్న అసెంబ్లీలో నోరు తెరిచి ప్రజా సమస్యలపై మాట్లాడవ అని ప్రశ్నించారు. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగం జనార్దన్ రెడ్డి పై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై నాగం మీడియాతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి కౌటర్ ఇచ్చారు. నాకు జ్ఞానం లేదని అంటున్నావు చాలా మంచిది అదే జ్ఞానంతో నీ అవినీతిని రుజువు చేసి జైలుకు పంపిస్తానని అన్నారు. నాగర్ కర్నూల్ సీఈవో నీ అని అంటున్నావు అసలు నీకు సీఈవో స్పెల్లింగ్ అన్న తెలుసా అని ఎద్దేవా చేశారు. CEO అంటే లక్షల్లో జీతాలు వస్తాయని సత్య నాదెళ్ల తో పోల్చుకున్న నీవు ఆ జీతం కోసం నల్ల మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నావనీ ఆరోపించారు.
Admin
Abhi9 News