Saturday, 18 April 2026 06:46:42 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రచారంలో దూసుకుపోతున్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్...

Date : 13 November 2023 01:56 PM Views : 374

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బీఆర్ఎస్ మహబూబ్ నగర్ అభ్యర్థి, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాంమందిర్ చౌరస్తా నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రరంభించారు. చౌరస్తాలో ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద మంత్రి టీ తయారు చేశారు. అనంతరం రోడ్డు పక్కన విక్రయిస్తున్న సీతాఫలాలను కొనుగోలు చేశారు. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న అన్ని దుకాణాల వద్దకు వెళ్ళి వారికి చేసిన అభివృద్ధిని వివరించి... భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ మందిర్ చౌరస్తా, పాన్ చౌరస్తా, క్లాక్ టవర్ వద్ద మంత్రి ప్రచారానికి అడుగడుగునా అనూహ్య స్పందన లభించింది. వ్యాపారాలు ఇంత బాగా జరుగుతున్నాయంటే మంత్రి చేసిన అభివృద్ధియే కారణమని వ్యాపారులు తెలిపారు. తాము బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :