Saturday, 13 June 2026 05:12:29 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం

Date : 15 July 2023 07:41 PM Views : 380

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : బిఆర్ఎస్ అసమర్థ పాలన వల్ల నీటి పంపకాల్లో పాలమూరుకు అన్యాయం జరిగిందనీ, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను నిలువునా దోచుకుంటున్నారనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.... మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం కరెంట్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయనీ విమర్శించారు... గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగ విద్యుత్ సరఫరా చేశామని ఇప్పుడు అది పూర్తిగా తొలగించారని మండిపడ్డారు.. రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు.. 60 శాతం నికర జలాలు పాలమూరులో వున్నాయనీ, ఇక్కడ కృష్ణా నది పారుతున్నప్పటికి రైతులకు నీరు అందడంలేదన్నారు... ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై కేసీఅర్ ఒక్కరోజైనా రివ్యూ చేశారా అని దుయ్యబట్టారు... రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఊచిత కరెంట్ ఇచ్చిందనీ అది బిఆర్ఎస్ పార్టీ మరచిపోయిందన్నారు.. కాంగ్రెస్ హయాంలో 400 కేవి సబ్ స్టేషన్ ను తెచ్చింది తానేనని తెలిపారు... బిఆర్ ఎస్ నాయకులు ఎంతసేపు కాళేశ్వరం పైనే మాట్లాడుతారు తప్ప పాలమూరు ప్రాజెక్టులపై నోరుమెదపరని అన్నారు... రిడిజైన్ ల పేరుతో ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు.. 24 గంటల విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారో దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు... సోనియాగాంధీ కాళ్ళకు దండం పెట్టిన కేసీఅర్ నేడు కాంగ్రెస్ కు తెలంగాణకు సంబంధం లేదని ఎలా చెప్తాడనీ పేర్కొన్నారు... అబ్ కె బాద్ కిసాన్ సర్కార్ అంటున్న కేసీఅర్ ముందు తెలంగాణ రైతులను సరిగ్గా చూసుకోవాలన్నారు... తెలంగాణ సర్కార్ వచ్చాకా ఒక్క ప్రాజెక్ట్ టెండర్ కూడా పారదర్శకంగా జరగలేదన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :