Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు మండలంలోని గగ్గలపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు జే.ఎస్.అర్. ఫౌండేషన్ దాతృత్వంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను జిల్లా విద్యాశాఖధికారి గోవిందరాజులు ప్రారంభించారు. గ్రామానికి దూరంగా ఉన్న పాఠశాలకు రక్షణ నిమిత్తం ఎంతో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఉపాధ్యాయ బృందంతో పాఠశాలలో మంచి విద్య అందుతుందని ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుటకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసించాలని సూచించారు.గ్రామ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి పాఠశాలలో ఆర్థిక సహకారంతో జెఎస్ఆర్ ఫౌండేషన్ మరింత తోడ్పాటు కావాలని కోరారు. జే.ఎస్.అర్. వ్యవస్థాపక అధ్యక్షుడు గగలపల్లి గ్రామ వాస్తవ్యులు జమ్ముల సతీష్ రెడ్డి పాల్గొని గ్రామాభివృద్ధికి తన వంతుగా మొదట పాఠశాల గ్రామమునకు సుదూరం గా ఉన్నందున పాఠశాలకు రక్షణను మెరుగుపరుచుటకు, ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థుల కోరిక మేరకు సీసీ కెమెరాలు తన వంతు కర్తవ్యం గా ఏర్పాటు చేసినట్లుగా, ముందు ముందు పాఠశాలకు అవసరమైన సహకారంను అందించగలనని సతీష్ రెడ్డి సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగినది.ఈ పాఠశాలలో 10 /10 రికార్డు సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యను దత్తత తీసుకొని ఉచితంగా చదివిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హరిప్రియ, ఎస్ఎంసి చైర్మన్ రామస్వామి జయకృష్ణ , డిఎస్ఓ కృష్ణారెడ్డి ,లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఎవరెస్టు అధ్యక్షులు రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు ఎం. నాగరాజు, బంధం పరమేశ్వర ప్రసాద్, అనంతరామశర్మ సత్యనారాయణ,అశోక్, విజయలక్ష్మి , సంధ్యారాణి , అరుణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News