Saturday, 18 April 2026 06:46:42 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

హరీష్ రావు‌ను కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!

Date : 14 July 2023 03:56 PM Views : 234

Abhi9 News - తెలంగాణ / Hyderabad : తెలంగాణలో రాజకీయాలు రసవతరంగా మారాయి. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటి అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. గత కొంతకాలంగా రాజాసింగ్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయ్. ఈ తరుణంలోనే బిజెపి నేతలు కొంతమంది ఇతర పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం ఉపందుకుంది. ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా తరుణంలోనే మంత్రి హరీష్ రావును బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరుతారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా... అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం లేనిది ఎన్నికల ముందు ఒక్కసారిగా కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడుతున్నారని ప్రచారం ఊపు అందుకున్న తరుణంలో రాజాసింగ్ బీఆర్ఎస్ మంత్రితో భేటీ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది...!!

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :