Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మణిపూర్ లో క్రైస్తవులపై జరిగిన దాడులను నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో క్రైస్తవులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు... ఈ సందర్భంగా జిల్లా ఎంబీసీ చర్చి పాస్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ... మే 3వ తేదీన మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగాయని, ఈ దాడిలో దాదాపు147 మంది మృతి చెందారని ఇది ఎంతో బాధకరమన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టామని తెలిపారు... కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి క్రైస్తవులపై దాడులకు పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు...
Admin
Abhi9 News