Saturday, 13 June 2026 04:59:45 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సర్పంచ్ ఎన్నికల్లో భార్య ఓటమిని జీర్ణించుకోలేక పోయిన భర్త.. నడి ఊరిలో ఏం చేశాడో తెలుసా?

ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఓటమి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను.. ఆపద వస్తే ముందు ఉన్నాను. ఎంతో ఖర్చు చే

Date : 13 December 2025 08:23 AM Views : 188

Abhi9 News - తెలంగాణ / ఖమ్మం : తొలి విడత పల్లె పోరులో లెక్క తేలింది. గ్రామాల్లో హైఓల్టేజ్‌ క్రియేట్‌ చేసిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో విజయకేతనం ఎగురవేశారు. గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అనుచరులు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఖమ్మం జిల్లాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి భర్త ఓటమి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఊరి కోసం ఏ పని ఉన్నా చేశాను.. ఆపద వస్తే ముందు ఉన్నాను. ఎంతో ఖర్చు చేశాను.. చివరకు సర్పంచ్ ఎన్నికల్లో ఓడించారు.. న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొన్ని గంటల పాటు హైడ్రామా.. ఉత్కంఠ మధ్య చివరకు ఆందోళన విరమించాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యా తండాలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా మాలోత్ రంగా భార్య పోటీ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ స్వాతి గెలుపొందింది. అయితే తాను గ్రామంలో సేవ చేస్తున్నా.. డబ్బులు ఖర్చు పెట్టినా గెలవలేదనీ, రిగ్గింగ్, అక్రమాలు చేసి తనను ఓడించారని.. న్యాయం చేయాలని కోరుతూ రంగా గ్రామంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దాదాపు ఆరు గంటల పాటు టవర్‌పైనే ఉండటంతో పోలీసులు, ఫైర్ సిబ్బందితో చేరుకుని మాట్లాడే ప్రయత్నం చేసినా ససేమేరా అన్నాడు. చివరకు విచారణ జరిపేందుకు ఎమ్మార్వో హామీతో ఆందోళన విరమించిన రంగా సెల్ టవర్ దిగి వచ్చాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ల్యాండ్ విషయంలో ఇలాగే సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడని స్థానికులు అంటున్నారు. న్యాయం చేయకపోతే మళ్ళీ సెల్ టవర్ ఎక్కుతానని మాలోత్ రంగా హెచ్చరించాడు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :