Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : ఈరోజు నుంచి నెల రోజుల పాటు జరిగే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల వాల్ పోస్టర్ను గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్, డిటీవో మేఘా గాంధీ కలిసి ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
Admin
Abhi9 News