Abhi9 News - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాలలో కేసీఆర్ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు..గద్వాలకు ఒరిగింది ఏమి లేదు, ఇచ్చిన హామీలను నెరవేర్చింది ఏమి లేదు కొత్తగా హామీ ఇచింది ఏమి లేదు అని ఎద్దేవా చేశారు.అదేవిధంగా టైం సరిపోదు రాత్రి అయ్యింది, హెలికాప్టర్ పోదని గద్వాల కు ఫుర్సాత్ గా వచ్చి మాట్లాడుతా అని చెప్పిన కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం డీకే బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ:తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డకోలుగా కెసిఆర్ కుటుంబం దోచుకున్నారని మండిపడ్డారు.తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ది పొందాలని ఉద్దేశ్యం తో బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ బారత దేశాన్ని దోచుకోవాలని ఉద్దేశ్యం తో జాతీయ పార్టీ పెట్టాడని బీఆర్ఎస్ పార్టీ ని స్థాపించే అర్హత కేసీఆర్ కు లేదని ఆరోపించారు. గద్వాల కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేసీఆర్ ,గతంలో గద్వాల జిల్లాకు ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేక గద్వాలకు ఏ ముఖం పెట్టుకొని వచ్చారని ఆమె ప్రశ్నించారు.గతంలో ముస్లిం లకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదన్నారు. అదేవిధంగా వాల్మీకి లకు ఎస్టీ జాబితా చేర్చుతాం అని చెప్పిన మాటలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అనుకున్న కేసీఆర్ 10నిమిషాలు మాత్రమే సభలో ప్రసంగం చేశారని ఎద్దేవా చేశారు...
Admin
Abhi9 News