Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా బుధవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో యోగా డే సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది శ్రీ హనుమాన్ కరాటే యోగ అసోసియేషన్ మాస్టర్ వెంకటేష్ గారు యోగా ఆసనాలు ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపీ వెంకటేష్ మాట్లాడుతూ యోగ అభ్యాసనం వలన రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యమంత జీవితాన్ని గడపవచ్చునని తెలిపారు. విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని జ్ఞాపకశక్తిని పెంపొందించుకొని ఉన్నతమైన లక్ష్యాలను చేరేందుకు యోగ తోడ్పాటు నిస్తుందన్నారు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో యోగ సాధనలో భాగంగా అలవర్చుకోవాలన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన యొక్క భారతీయ సాంప్రదాయాలలోని యోగాకు ఉన్న గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేశాడు అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలను అనుసరిస్తున్నాయని వారు తెలిపారు .మనకు మన పూర్వీకులు ఋషులు, మహర్షులు అందించిన గొప్ప సంపద యోగాని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడకుల బాలరాజు. జిల్లా ఉపాధ్యక్షులు పి సత్యం. జిల్లా ప్రధాన కార్యదర్శి పి .శ్రీనివాసరెడ్డి. కోశాధ్యక్షులు పాండురంగారెడ్డి. కార్యదర్శులు బుచ్చిరెడ్డి .అసెంబ్లీ కన్వీనర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పచ్చిగట్ల అంజయ్య నాగేశ్వర్ రెడ్డి. జాజం సుబ్రహ్మణ్యం. కిరణ్ కుమార్ రెడ్డి .జామ్ శ్రీనివాసులు. మాజీ సర్పంచ్ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు. కే సతీష్ కుమార్ .పద్మ వేణమ్మ .కుమార్. నారాయణ యాదవ్. శ్రీధర్. వెంకటేష్ .తదితరులు పాల్గొన్నారు
Admin
Abhi9 News