Saturday, 18 April 2026 06:51:59 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన, డంపింగ్ చేసిన కఠిన చర్యలు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన, డంపింగ్ చేసిన కఠిన చర్యలు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

Date : 11 February 2025 08:26 PM Views : 401

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వనపర్తి జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇక్కడ ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (PDPP) చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం (Mines and Minerals Act) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి ప్రభుత్వ అనుమతులున్న వారికి మాత్రమే ఇసుక రవాణా చేయడానికి , విక్రయించేందుకు హక్కు ఉందని, ఇతరులెవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రజలు సమాచారం అందించాలని, 100, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 6303923200 నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా అక్రమ డంపింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ రవాణా అక్రమ డంపింగ్ చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :