Saturday, 18 April 2026 05:16:03 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

పారిశుధ్య కార్మికులు పారిశుధ్య పనులు సజావుగా నిర్వహించడం తో పాటు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు

Date : 30 June 2023 03:04 PM Views : 958

Abhi9 News - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని 26,29,33వ వార్డులలో తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సంద్భంగా కలెక్టర్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే తడి పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని, ఎవరైనా ఇళ్ళ నుండి తమ చెత్తను, ప్లాస్టిక్ ను మురుగు కాలువలో పడేస్తే అలాంటి వారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, 15రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి 15 రోజులకు మునిసిపాలిటీ ఆవరణంలోనే హెల్త్ క్యాంపు పెడతామని, అక్కడే వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రతినెల జీతం పడుతుందా లేదా అనీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవనాన్ని, టౌన్ హాల్, లలితకళా తోరణం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతలో లోపం లేకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపాలిటీ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :