Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ,కార్మికుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా3వ రోజు అడ్డాకల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అథితులు గా విచ్చేసిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వి. కురుమూర్తి,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాంమోహన్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, 11వ పిఆర్సి లో నిర్ణయించిన మినిమం బేసిక్ రూ.19000 వేతనం చెల్లించాలని, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15600 చెల్లించాలని, పంపుసెట్టు ఆపరేటర్లకు, ఎలక్ట్రీషియన్లకు, డ్రైవర్లకు, కారొబార్లకు, బిల్ కలెక్టర్ లకు 19500 నిర్ణయించాలి. ప్రమాదం జరిగి మరణించిన కార్మికుని కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ గ్రాటిటి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కారోబార్, బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణ రద్దు చేయాలని, గ్రామపంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాల అమలు చేయాలని, జీవో నెంబర్ 51 సవరించాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, ఆదివారాలు,పండుగ సెలవులు, జాతీయ ఆర్జిత సెలవులను అమలు చేయాలని, డ్రైవర్లకు పంచాయతీల ద్వారానే లైసెన్సులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డాకల్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు రవి సాగర్ ,కుర్మయ్య, రాములు,వెంకటయ్య,చంద్రమ్మ,మనెమ్మ,యేసమ్మ, రాములమ్మ మరియు అధిక సంఖ్యలోకార్మికులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News