Abhi9 News - తెలంగాణ / సూర్యాపేట : మణిపూర్ రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాఘవ ప్లాజా వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడుల గురించి భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆనిరాజా తో సహా నిజనిర్ధారణ కమిటీ నిస్సా సిద్దు, స్వతంత్ర న్యాయవాది దీక్ష దీవిలపై నిజ నిర్ధారణ కమిటీ కోసం అక్కడికి వెళితే మణిపూర్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకొని శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వల్ల సామాన్య ప్రజలకు తినడానికి తిండి లేక అనేక విధాలుగా నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. అక్కడికి వెళ్లిన మహిళా సమాఖ్య అధ్యక్షులపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తి వేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షురాలు అనంతుల మల్లీశ్వరి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుప్పతల కోటమ్మ, దేవరం మల్లీశ్వరి, ఎల్లావుల ఉమా, పొన్నం వెంకటమ్మ, భాగ్య, ఎల్లావుల సీత, మంగమ్మ ,పద్మ, సుజాత, అమృత, రుద్రమ్మ, లక్ష్మమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News