Monday, 05 January 2026 04:32:49 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి ఎం చేశారో తెలుసా..

ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె లగ్జరీ జీవనశైలికి అలవాటు పడింది. ఆఫీస్‌లో వచ్చే సాలరీ సరిపోకపోవడంతో.. అడ్డదారిలో డబ్

Date : 24 December 2025 02:17 PM Views : 68

Abhi9 News - తెలంగాణ / Hyderabad : చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మిత అనే యువతి, తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన సుష్మిత, యువతను టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. చిక్కడపల్లి పరిధిలో గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి సుష్మిత–ఇమాన్యుల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్ వంటి ఖరీదైన మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ మొత్తం సుమారు రూ. 4 లక్షల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా వెనుక మరెంత మంది ఉన్నారు, ఈ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించిందన్న దానిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా ఈ డ్రగ్స్ విక్రయాలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా మరోసారి వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ దందాను ఆన్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా నడిపిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించి కస్టమర్లను సంప్రదించడం, హోమ్ డెలివరీ తరహాలో డ్రగ్స్ సరఫరా చేయడం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులే లక్ష్యంగా డీలింగ్ కొనసాగించినట్లు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను డిజిటల్ పేమెంట్స్ ద్వారా నిర్వహిస్తూ, పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. కేసులో కీలక నిందితురాలిగా ఉన్న సుష్మిత, ఇమాన్యుల్‌లను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన డీలర్లు ఎవరు, నగరానికి మత్తుపదార్థాలు ఎలా చేరుతున్నాయన్న అంశాలపై ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణపై మరింత కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :