Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిపై నిన్న జగిత్యాలలో జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి కేటీఆర్ అనుచితమైన మాటలు మాట్లాడిన కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసనలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ, కేటీఆర్ ప్రెస్ మీట్ లో ఈ విధంగా అనుచితమైన మాటలు మాట్లాడడమే కాకుండా, వ్యవసాయంపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదని మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు క్లబ్ లు, పబ్ లు తిరుగుతారని, ఆయనకు వడ్లు తెలియవు, ఎడ్లు తెలియవు అంటూ హేళన చేసే విధంగా మాట్లాడారు. ఈ వాక్యాలను కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో హరిత విప్లవం, క్షీర విప్లవం తెచ్చి అనేక సాగు నీటి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశంలో 30 కోట్ల మందికి కూడా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉండేది. స్వర్గీయ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. నేడు దేశం ప్రపంచంలోనే 250 దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. జలాశయాలు ఆధునిక దేవాలయాలుగా భావించి, నాగార్జున సాగర్, శ్రీశైలం మరియు శ్రీరామ్ సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఏక కాలంలో రుణమాఫీ చేసి, రైతులను రుణ విముక్తులను చేసింది. దేశంలో మొదటిసారిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీనీ, వ్యవసాయం అంటే ఏంటో తెలియని కేటీఆర్ విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, రెండుసార్లు ప్రధానమంత్రి పదవి, కనీసం మంత్రి పదవి కూడా తీసుకోకుండా నిరాండబరమైన జీవితం గడుపుతున్న రాహుల్ గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కి లేదు. కేటీఆర్ రాహుల్ గాంధీ గారిపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసనలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
Admin
Abhi9 News