Abhi9 News - తెలంగాణ / నారాయణపేట : జూన్ 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపిఎస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించిన కేసుల వివరాలను వెల్లడించారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు విశేష స్పందనను చూయించి రాజి కుదుర్చుకొని ఇరు వర్గాల కాక్షి దారులు విజయవంతంగా కేసులను పూర్తి చేసుకున్నారని తెలిపారు. జిల్లాలోని 12 పోలీసు స్టేషన్లలో పరిష్కరించబడిన కేసులు మొత్తం 2816 కేసులుగా గుర్తించబడినదని తెలిపారు. ఇందులో ఐపిసి కేసులు 137 పరిష్కరించగా, 1953 ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 726 ఉండగా వాటికి ఫైన్ విధించినట్లు తెలియజేశారు. మొత్తం జరిమానా 4,10,000/- చెల్లించడం జరిగిందని తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులలో ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరియు ఎక్సైజ్ కేసులు, నేర నిరూపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో ఈ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కొట్లాట, భార్యాభర్తల మధ్య గల వివాహ సంబంధమైన వివాదములు, అత్తింటి వారి వేధింపులు, అన్ని రకాల క్రిమినల్ కేసులు, నిందితులు బాధితులు కలిసి హాజరై రాజీమార్గంలో రాజీ పడటంతో కేసులను కొట్టివేసినట్లు తెలిపారు. కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ విధులను నిర్వర్తించిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు గారిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జ్ విద్యా నాయక్ గారిని పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కో డ్యూటీ ఆఫీసర్స్ ని పోలీస్ అధికారులు, సిబ్బందిని తదితరులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
Admin
Abhi9 News