Saturday, 18 April 2026 03:30:57 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తామని మద్రాస్ హైకోర

Date : 06 February 2026 09:27 AM Views : 138

Abhi9 News - క్రైమ్ వార్తలు / : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తామని మద్రాస్ హైకోర్టుకు ఐటీ శాఖ వివరించింది. జయ ఆస్తులకు సంబంధించి ఐటీ శాఖకి సుమారు ఇరవై కోట్లు పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో జయ వారసులుగా ఉన్న దీప, దీపక్ ఇద్దరికి పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. ఐటీ శాఖ పంపించిన నోటీసులకు వ్యతిరేకంగా జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, జనవరి నెలాఖరు వరకు చెల్లించాల్సి ఉన్న ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను సుమారు ఇరవై కోట్లకిపైగా ఉందని ఐటీ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు కోటి పన్నెడు లక్షల వరకు మాత్రమే చెల్లించినట్టు ఐటీ అధికారులు కోర్టుకు తెలిపారు. అవినీతి కేసుకు సంబంధించి జయ ఆస్తులను సీజ్ చేశాం కాబట్టి ఆదాయపు పన్ను , ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆ ఆస్తులను వేలం వేస్తామని కోర్టుకు ఐటీ శాఖ స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేసింది. జయలలిత చనిపోయిన మరుసటి రోజు నుంచి ఆస్తులు ఎవరికి దక్కాలన్న విషయంలో చాలా రోజులు వివాదం నడిచింది. అయితే ఆమె ఆస్తులు మేనల్లుడు, మేనకోడలికే చెల్లుతాయని కోర్టు ప్రకటించింది. దీంతో ఐటీ శాఖ ఇద్దరికి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :